వార్తలకు తిరిగి వెళ్లండి

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలో వాతావరణం ఒక్కసారిగా మారింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి విజయవాడలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుండటంతో రోడ్లు జలమయమయ్యాయి.
ఈ ఏడాదిలో విజయవాడలో కురిసిన వర్షాల్లో ఇదే అత్యధికమని వాతావరణ శాఖ తెలిపింది. మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Comments
Loading comments...

