వార్తలకు తిరిగి వెళ్లండి

మంచిర్యాల-వాంకిడి ఎన్‌హెచ్-363పై వన్యప్రాణుల సంచారానికి రూ.22 కోట్లతో నిర్మిస్తున్న ఎకో వంతెన తుదిదశకు చేరింది. అడవిని తలపించేలా రూపొందిస్తున్న ఈ వంతెనపై నుంచి జంతువులు సురక్షితంగా రాకపోకలు సాగించనున్నాయి.
గోయగాం-లక్కడకోట్ మధ్య నిర్మిస్తున్న ఈ వంతెనతో ప్రమాదాలు తగ్గనున్నాయి. ఇదే రహదారిపై తక్కళ్లపెల్లి వద్ద అండర్‌పాస్ కూడా ఏర్పాటు చేశారు. పర్యావరణ ప్రేమికులు ఈ చర్యలను అభినందిస్తున్నారు.
Comments
Loading comments...
