వార్తలకు తిరిగి వెళ్లండి
జాతీయBreaking
జమ్మూలో భూప్రకంపనలు
పార్వతి దేవి Jun 25, 2026 2:25 AM అల్ ఇండియా 17 views1 day ago

జమ్మూ కాశ్మీర్‌లో నేడు తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. పుల్వామా, పహల్గాం ప్రాంతాల్లో భూమి కంపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. తెల్లవారుజామున 02:36 గంటలకు నమోదైన ఈ ప్రకంపనలు, రిక్టర్ స్కేలుపై 3.5 తీవ్రతగా నమోదయ్యాయి.
భూకంప కేంద్రం లోయ పరిసరాల్లో ఉండటంతో ప్రకంపనలు స్పష్టంగా కనిపించాయి. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. పరిస్థితిని అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
Comments
Loading comments...