Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమ నేపాల్‌లో రిక్టర్ స్కేలుపై 4.2తో భూకంపం

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Jul 22, 2026 11:57 AM జాతీయంGeneral
పశ్చిమ నేపాల్‌లో రిక్టర్ స్కేలుపై 4.2తో భూకంపం - Udayam
బుధవారం తెల్లవారుజామున పశ్చిమ నేపాల్‌లోని బజాంగ్ జిల్లా కోట్‌దేవాల్ కేంద్రంగా 4.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఉదయం 4:40 గంటల ప్రాంతంలో ఈ ప్రకంపనలు వచ్చినట్లు జాతీయ భూకంప పర్యవేక్షణ కేంద్రం వెల్లడించింది. గత వారంలోనూ రుకుమ్ ఈస్ట్ జిల్లాలో 5 తీవ్రతతో భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే. కాగా, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని తెలిపారు.

Comments

G
Loading comments...