Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చైనాలో భూకంపం.. తీవ్రత 5.6

Follow Udayam on Google
కీర్తన్ Aug 19, 2026 8:31 AM జాతీయంGeneral
చైనాలో భూకంపం.. తీవ్రత 5.6 - Udayam
ఉత్తర-పశ్చిమ చైనాలోని కింగ్హాయ్‌ ప్రావిన్స్‌లో బుధవారం ఉదయం 5:36 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 5.6గా నమోదైంది. హైక్సీ ప్రిఫెక్చర్‌లో భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంపంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతానికి ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు వెల్లడికాలేదు. స్థానిక యంత్రాంగం పరిస్థితిని సమీక్షిస్తోంది.

Comments

G
Loading comments...