Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ-పర్మిట్‌తో అక్రమాలకు చెక్‌

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Aug 04, 2026 7:20 AM కృష్ణా జిల్లాGeneral
ఈ-పర్మిట్‌తో అక్రమాలకు చెక్‌ - Udayam
వ్యవసాయ మార్కెట్‌ కమిటీల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ-రవాణా పర్మిట్‌ విధానాన్ని అమలు చేస్తున్నారు. జిల్లాలోని 12 మార్కెట్‌ కమిటీల్లో పారదర్శక వ్యాపారం జరిగేలా అధికారులు చర్యలు చేపట్టారు. గతంలో పన్ను చెల్లింపుల్లో లోపాలు, ఒకే రసీదుతో ఎక్కువ సరుకు తరలింపు వంటి సమస్యలు ఉండేవి. నగదు రహిత లావాదేవీలతో పాటు ఆదాయం పెంచేందుకు కొత్త విధానం తీసుకొచ్చారు.

Comments

G
Loading comments...