Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుబ్బాకలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Follow Udayam on Google
మధుప్రియ Aug 15, 2026 1:57 PM నిజామాబాద్General
దుబ్బాకలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు - Udayam
దుబ్బాక గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షురాలు పెండ అరుణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు నర్సయ్య, సంతోష్, ప్రతాప్, ప్రేమ్, చరణ్, పోతన్న, అశోక్, దస్తారథ్, కురగంగాధర్‌ కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...