వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి: మండలంలోని దుబ్బాక గ్రామపంచాయతీలో మంగళవారం వి.బి.జి.ఆర్.ఎం.జి. పథకంపై గ్రామసభ నిర్వహించారు. గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, ఉపాధి హామీ పనుల ప్రణాళికపై గ్రామస్థులతో చర్చించారు. గ్రామ అవసరాలకు అనుగుణంగా పనులను గుర్తించి, గ్రామసభ ఆమోదంతో ప్రణాళిక రూపొందించాలని అధికారులు సూచించారు.
కార్యక్రమంలో సర్పంచ్ సరోజన దేవి, ఉప సర్పంచ్ శేఖర్ రెడ్డి, సెక్రటరీ సాయికుమార్, పాల్గొన్నారు
Comments
Loading comments...

