వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాకాలంలో డెంగీ నివారణకు ప్రతి ఇంటా వారానికి ఒకసారి డ్రై డే పాటించాలని సబ్ యూనిట్ ఆఫీసర్ శివన్న సూచించారు. గద్వాల శేరల్లి వీధిలో డెంగీ అనుమానిత కేసు నేపథ్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఇళ్ల వద్ద నిల్వ నీటిని తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమల లార్వా వృద్ధిని అరికట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

