వార్తలకు తిరిగి వెళ్లండి
మనవరాలితో డ్రైవింగ్: ఎస్సైపై కేసు

నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని గంధంగూడ వద్ద హడావిడిగా ఉన్న రోడ్డుపై ఆరున్నరేళ్ల మనవరాలితో కారు నడిపించిన ఎస్సై తిరుపతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. చిన్నారి డ్రైవింగ్ చేస్తుండగా స్థానికులు అడ్డుకుని నిలదీశారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని చెప్పే పోలీసులే ఇలా నిబంధనలు ఉల్లంఘించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
Comments
Loading comments...