వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడిటీని ప్రస్తుతం ఉన్న 20 ఏళ్ల నుంచి 50 సంవత్సరాలకు పెంచే ప్రతిపాదనపై కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తోంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే వాహనదారులకు తరచూ లైసెన్స్ పునరుద్ధరణ చేసుకునే తిప్పలు తప్పడమే కాకుండా, సమయం మరియు ఖర్చు ఆదా అవుతాయి.
దీంతో పాటు ఆర్టీవో సేవలను పూర్తిగా ఆన్‌లైన్ చేయాలని కేంద్రం యోచిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు, రవాణా శాఖ అధికారులతో ప్రాథమిక చర్చలు జరుగుతున్నాయని, దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

