వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణపేట మండలం కోటకొండలో మూడు రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోవడంతో తాగునీటి ఎద్దడి ఏర్పడింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పండుగ సమయంలోనూ నీరు రాకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోవడానికి కారణాలు ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికారులు స్పందించి వెంటనే తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

