Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బిలకలగూడూరులో తాగునీటి కష్టాలు

Follow Udayam on Google
Anuroop Aug 24, 2026 11:56 AM నంద్యాలGeneral
బిలకలగూడూరులో తాగునీటి కష్టాలు - Udayam
గడివేముల మండలం బిలకలగూడూరులో 10 రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో ఎస్సీ కాలనీతో పాటు పలు వీధుల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చుక్క నీటి కోసం అవస్థలు పడుతున్నామని గ్రామస్థులు తెలిపారు. నీటి సమస్యపై అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.

Comments

G
Loading comments...