Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధానిపై అనుమానం సరికాదు: కేంద్రం

Follow Udayam on Google
రవళి దేవి Jul 31, 2026 6:27 AM జాతీయంGeneral
ప్రధానిపై అనుమానం సరికాదు: కేంద్రం - Udayam
ఎన్నికల కమిషనర్ల నియామక చట్టం-2023ను కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సమర్థించింది. ఎంపిక కమిటీలో ప్రధాని, కేంద్ర మంత్రి ఉండటాన్ని ప్రశ్నించడం రాజ్యాంగ విశ్వసనీయతను దెబ్బతీస్తుందని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదించారు. కమిటీలో 2:1 నిష్పత్తిపై జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా అభిప్రాయం వ్యక్తం చేయగా, ఎన్నికల సంఘం స్వతంత్రంగా కనిపించాలన్నారు. విచారణ అనంతరం ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది.

Comments

G
Loading comments...