Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - CI

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 01, 2026 6:30 PM విజయనగరంGeneral
దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - CI - Udayam
విజయనగరం పట్టణంలోని 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని సీఐ ఆర్.వి.ఆర్.కే.చౌదరి మంగళవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఇటీవల నమోదైన పలు దొంగతనం కేసుల్లో సీసీ కెమెరాల దృశ్యాలు, సాంకేతిక ఆధారాలు, అనుమానితుల కదలికలను విశ్లేషించి నిందితులను గుర్తించామన్నారు. నేరాలకు పాల్పడుతున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Comments

G
Loading comments...