వార్తలకు తిరిగి వెళ్లండి

ఆహార పదార్థాల ప్యాకింగ్, పంపిణీ లేదా నిలువ కోసం వార్తాపత్రికలను ఉపయోగించవద్దని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (FSSAI) ఆదేశించింది. పేపర్ ముద్రణకు వాడే సిరాలో సీసం వంటి ప్రమాదకర రసాయనాలు ఉంటాయని, ఇవి వేడి ఆహారంలోకి చేరి క్యాన్సర్, జీర్ణకోశ వ్యాధులు, మూత్రపిండాల సమస్యలకు దారితీస్తాయని హెచ్చరించింది.
రెస్టారెంట్లు, వీధి వ్యాపారులు ఈ నిబంధనను తక్షణమే అమలు చేయాలని స్పష్టం చేసింది. ఆహార పదార్థాల నిలువకు కేవలం 'ఫుడ్-గ్రేడ్' మెటీరియల్స్ మాత్రమే వాడాలని సూచిస్తూ, నిబంధనలను కఠినంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించింది.
Comments
Loading comments...

