వార్తలకు తిరిగి వెళ్లండి

దమ్మపేటలో లైసెన్స్ మద్యం దుకాణాల్లో తమకు కావాల్సిన బ్రాండ్లు లేవని చెప్పి బెల్ట్ షాపులకు పంపుతున్నారని ఆరోపిస్తూ వినియోగదారులు బుధవారం రాత్రి నిర్వాహకులను నిలదీశారు. ఈ క్రమంలో వాగ్వాదం చోటుచేసుకుంది.
సమాచారం అందుకున్న పోలీసులు దుకాణాన్ని పరిశీలించారు. లేవని చెప్పిన బ్రాండ్లు షాపులోనే ఉన్నట్లు వినియోగదారులు పేర్కొన్నారు. దీంతో మద్యం అదనపు ధరలకు విక్రయిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.
Comments
Loading comments...

