వార్తలకు తిరిగి వెళ్లండి

దళితవాడ పంచాయతీల ఏర్పాటు, ఒక్కో పంచాయతీకి రూ.2 కోట్ల నిధులు సాధించడమే అంబేడ్కర్ ఇండియా మిషన్ లక్ష్యమని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు పీవీ సునీల్‌కుమార్ తెలిపారు.
మంగళవారం శ్రీకాకుళంలో విలేకరులతో మాట్లాడారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వబోమని, ఐఎఎం తరఫున అభ్యర్థులు స్వతంత్రులుగా పోటీ చేస్తారని చెప్పారు. తమ డిమాండ్లను అంగీకరించే పార్టీలకే మద్దతు ఉంటుందన్నారు.
Comments
Loading comments...

