వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా కర్నూలు ఎస్‌టిబీసీ కళాశాల మైదానంలో రైజింగ్ స్టార్ హాకీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి హాకీ పోటీలు ముగిశాయి. బాలుర, బాలికల విభాగాల్లో 12 జట్లు పాల్గొన్నాయి.
బాలుర విభాగంలో ఇండస్ రెసిడెన్షియల్ మాంటిస్సోరి స్కూల్ ప్రథమ, మైండ్స్ హైస్కూల్ ద్వితీయ, మీది వేముల జడ్పీహెచ్‌ఎస్ తృతీయ స్థానాల్లో నిలిచాయి. బాలికల విభాగంలో దిగువపాడు జడ్పీహెచ్‌ఎస్ విజేతగా నిలిచింది.
Comments
Loading comments...

