Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దోమలగూడలో ముగ్గురు బాలికల అదృశ్యం

నిహారిక రెడ్డి Jul 20, 2026 9:26 AM హైదరాబాద్about 19 hours ago
దోమలగూడలో ముగ్గురు బాలికల అదృశ్యం - Udayam Digital
హైదరాబాద్‌ దోమలగూడకు చెందిన ముగ్గురు మైనర్ బాలికలు ఇంట్లో చెప్పకుండా అదృశ్యమయ్యారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వలస కుటుంబాలకు చెందిన ఈ బాలికలు హిమాయత్‌నగర్‌లో ఆటో ఎక్కి, కాచిగూడ రైల్వేస్టేషన్ వద్ద దిగినట్లు సీసీటీవీ విజువల్స్ ఆధారంగా పోలీసులు కనుగొన్నారు. బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, బాలికల ఆచూకీ కోసం దర్యాప్తును ముమ్మరం చేశారు.

Comments

G
Loading comments...