Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భోజనం వికటించిన ఘటన.. వార్డెన్‌ సస్పెన్షన్‌

Follow Udayam on Google
భవేష్ కుమార్ Aug 05, 2026 11:13 AM వరంగల్General
భోజనం వికటించిన ఘటన.. వార్డెన్‌ సస్పెన్షన్‌ - Udayam
వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో భోజనం వికటించి విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటనపై వార్డెన్‌ యాకూబ్‌ను కలెక్టర్‌ సస్పెండ్‌ చేశారు. వంటశాలలో కుళ్లిన కూరగాయలు గుర్తించడంతో తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. త్రిసభ్య కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే వార్డెన్‌కు సంబంధం లేదంటూ విద్యార్థినులు సస్పెన్షన్‌ ఎత్తివేయాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...