వార్తలకు తిరిగి వెళ్లండి
హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్ బస్‌డిపో సమీపంలోని సంతోషిమాత ఆలయంలో శుక్రవారం కలకలం చోటుచేసుకుంది. ఆలయంలోకి ప్రవేశించిన ఓ వ్యక్తి కర్రతో అమ్మవారి విగ్రహంపై దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పూజారిపై కూడా దాడి చేసినట్లు సమాచారం.
అప్రమత్తమైన భక్తులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

