Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడలో డిజిటల్ అరెస్ట్.. భారీ మోసం

Follow Udayam on Google
Anuroop Sep 26, 2026 9:16 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
విజయవాడలో డిజిటల్ అరెస్ట్.. భారీ మోసం - Udayam
విజయవాడ పటమట నాగార్జున నగర్‌కు చెందిన 80 ఏళ్ల రిటైర్డ్ ఇంజినీర్‌ను సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసం చేశారు. పోలీసులమంటూ బెదిరించి, ఐపీఎస్ అధికారిణి పేరుతో వీడియో కాల్ చేసి రూ.71.30 లక్షలను తమ ఖాతాలోకి బదిలీ చేయించుకున్నారు. డబ్బులు తిరిగి రాకపోవడంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...