Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధ్వంసమైన కల్వర్టుతో ప్రమాదం

Follow Udayam on Google
Kiran Oct 01, 2026 11:09 AM ములుగు General
ధ్వంసమైన కల్వర్టుతో ప్రమాదం - Udayam
ములుగు జిల్లా కేంద్రంలో జాతీయ రహదారిని ఆనుకుని రెడ్డి టీ స్టాల్‌ పక్కన డ్రైనేజీపై నిర్మించిన కల్వర్టు ధ్వంసమైంది. ఇనుప ఊచలు పైకి తేలడంతో ప్రమాదకరంగా మారింది. నిత్యం వాహనాలు రాకపోకలు సాగిస్తున్నా సూచిక బోర్డు ఏర్పాటు చేయలేదు. ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్‌ అధికారులు వెంటనే స్పందించి కొత్త కల్వర్టు నిర్మించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...