Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధూపాడు, మేడేపి గ్రామ కార్యాలయాల తనిఖీ

Follow Udayam on Google
Anuroop Sep 18, 2026 6:23 PM మార్కాపురంGeneral
ధూపాడు, మేడేపి గ్రామ కార్యాలయాల తనిఖీ  - Udayam
త్రిపురాంతకం మండలంలోని ధూపాడు, మేడేపి స్వర్ణ గ్రామ కార్యాలయాలను జిల్లా కలెక్టర్ విజయ సునీత ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు, భూ సర్వేలు, పెన్షన్ పంపిణీపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు. అనంతరం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

Comments

G
Loading comments...