Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధరూర్‌లో తాళం వేసిన ఇంట్లో చోరీ

Follow Udayam on Google
Vamshi Vardhan Sep 06, 2026 2:43 PM జగిత్యాలGeneral
ధరూర్‌లో తాళం వేసిన ఇంట్లో చోరీ - Udayam
జగిత్యాల రూరల్‌ మండలం ధరూర్‌ గ్రామంలో ఆదివారం చోరీ ఘటన కలకలం రేపింది. తాళం వేసి ఉన్న ఇంటి గేటు తాళం కట్‌ చేసి లోపలికి చొరబడిన దుండగులు బంగారు, వెండి వస్తువులతో పాటు సెల్‌ఫోన్‌ అపహరించినట్లు స్థానికులు తెలిపారు. నాగిశెట్టి రేవతి మూడు రోజులుగా ఇటిక్యాలలో బంధువుల ఇంట్లో ఉండగా, ఇంటికి వచ్చేసరికి చోరీ జరిగినట్లు గుర్తించారు. ఘటనపై జగిత్యాల రూరల్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...