Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధరూర్ మండలంల్లో ఘనంగా బోనాల పండగ

Follow Udayam on Google
dasari naveen kumar Aug 12, 2026 8:40 AM వికారాబాద్General
ధరూర్ మండలంల్లో ఘనంగా బోనాల పండగ - Udayam
వికారాబాద్ జిల్లా,ధారూర్ మండలం ధర్మాపూర్ గ్రామంలో బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. గ్రామంలోని పోచమ్మ, మైసమ్మ దేవతలకు గ్రామ పెద్దలతో కలిసి మహిళలు బోనాలు సమర్పించారు. పోతురాజు విన్యాసాలు, ఆటపాటలు, శివసత్తుల పూనకాలతో జాతర కోలాహలంగా సాగింది. గ్రామం సుఖసంతోషాలతో, పాడిపంటలతో వర్ధిల్లాలని ప్రజలు అమ్మవారిని మొక్కుకున్నారు. ఈ వేడుకల్లో గ్రామానికి చెందిన మహిళలు, యువత, పెద్దలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...