వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి: ప్రభుత్వ డిగ్రీ కళాశాల ధర్పల్లి జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) ఆధ్వర్యంలో సోమవారం మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం, ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు.
ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు పరిసరాల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, పేపర్లను సేకరించి, పిచ్చి మొక్కలను తొలగించి ఆయా ప్రాంతాలను పరిశుభ్రంగా మార్చారు. ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

