వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి కేజీబీవీ ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న కుర్చీల కొరతను గమనించిన పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో 12 కుర్చీలను అందజేశారు. శుక్రవారం ఎంఈఓ రమేష్ చేతుల మీదుగా కుర్చీలను పాఠశాల నిర్వాహకులకు అందించారు.
మండలంలోని ఏ పాఠశాలలోనైనా అవసరమైన సహాయం ఉంటే తమవంతు సహకారం అందిస్తామని ఉపాధ్యాయులు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు వి. రాజారెడ్డి, సతీష్, ప్రసన్నకుమార్‌తో పాటు కేజీబీవీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు
Comments
Loading comments...

