Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండలంలో ఘనంగా నాగుల పంచమి

Follow Udayam on Google
మధుప్రియ Aug 17, 2026 9:37 AM నిజామాబాద్General
ధర్పల్లి మండలంలో ఘనంగా నాగుల పంచమి - Udayam
ధర్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో నాగుల పంచమి పర్వదిన వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మహిళలు తెల్లవారుజామునే ఆలయాలకు చేరుకుని నాగదేవతకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి పాలు, పండ్లు, పసుపు, కుంకుమ సమర్పించారు. నాగదేవతను దర్శించుకుని కుటుంబ సభ్యులు సుఖసంతోషాలతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో ఆయా ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి.

Comments

G
Loading comments...