వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మవరం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో వచ్చే నెల 4న ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు డాక్టర్ సుబ్బారావు, రాధాకృష్ణ, చాంద్ బాషా తెలిపారు. గురువారం శిబిరానికి సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు.
ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రముఖ వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేస్తారని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

