Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మపురిలో రోడ్డు ప్రమాదం ఒకరి పరిస్థితి విషమం

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 07, 2026 10:26 AM జగిత్యాలGeneral
ధర్మపురిలో రోడ్డు ప్రమాదం ఒకరి పరిస్థితి విషమం - Udayam
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తిమ్మాపూర్ గ్రామ శివారులోని గండి హనుమాన్ ఆలయం సమీపంలో గురువారం డీసీఎం వ్యాను ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ముగ్గురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...