వార్తలకు తిరిగి వెళ్లండి

చింతామణి చెరువు వద్ద ధర్మపురి మండల ప్రొఫెషనల్ ఫోటో & వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఫోటోగ్రాఫర్లు జెండా ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం కొత్తపెళ్లి కిషన్, పవన్ స్టూడియో కైలాస్, వడ్లూరి రవీందర్‌లను సన్మానించారు. ఫోటోగ్రఫీ ద్వారా చారిత్రక ఘట్టాలను భవిష్యత్ తరాలకు అందిస్తున్న ఫోటోగ్రాఫర్ల సేవలు అభినందనీయమని పేర్కొన్నారు.
Comments
Loading comments...

