Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధన్వాడ విద్యార్థులు రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీలకు ఎంపిక

Follow Udayam on Google
Kiran Oct 13, 2026 5:04 PM నారాయణపేటGeneral
ధన్వాడ విద్యార్థులు రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీలకు ఎంపిక - Udayam
మక్తల్‌లో ఈ నెల 10న నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి సైక్లింగ్ పోటీల్లో ధన్వాడ మోడల్ స్కూల్ విద్యార్థులు శ్రీశైలం సాగర్, అనిల్ కుమార్ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. ఈ విషయాన్ని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గోపాలం తెలిపారు. మంగళవారం విద్యార్థులకు మెడల్స్, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ నెల చివరి వారంలో సిద్దిపేటలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో వారు పాల్గొననున్నారు.

Comments

G
Loading comments...