వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీలంక టెస్టు జట్టు కెప్టెన్ ధనంజయ డి సిల్వ సారథ్య బాధ్యతల నుంచి తక్షణమే తప్పుకొంటున్నట్లు గురువారం ప్రకటించాడు. కొత్త తరానికి కెప్టెన్సీ బాధ్యతలు అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.
కెప్టెన్సీ నుంచి వైదొలిగినా ఆటగాడిగా కొనసాగుతానని ధనంజయ స్పష్టం చేశాడు. 2024 జనవరిలో టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన అతడు.. 18 మ్యాచ్‌ల్లో జట్టుకు సారథ్యం వహించి ఏడు విజయాలు అందించాడు.
Comments
Loading comments...

