వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మవరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మిగిలిన సీట్ల భర్తీకి ఈనెల 5న మధ్యాహ్నం 3 గంటలకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ సురేశ్ బాబు తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు 3వ తేదీలోగా కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
స్పాట్ అడ్మిషన్లకు హాజరయ్యే విద్యార్థులు ఇంతకుముందు ఏ పాలిటెక్నిక్ కళాశాలలోనూ అడ్మిషన్ పొందకూడదని తెలిపారు. అడ్మిషన్ ఫీజుగా రూ.6,000 తీసుకురావాలని సూచించారు.
Comments
Loading comments...

