వార్తలకు తిరిగి వెళ్లండి

లింగాలకు సమీపంలోని నల్లమలలో మలుపు మైసమ్మ ఆలయం భక్తుల విశ్వాస కేంద్రంగా నిలుస్తోంది. అప్పాయిపల్లి వెళ్లే రహదారి మలుపులో ఆలయం ఉండటంతో అమ్మవారికి ఈ పేరు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు.
ఘాట్‌రోడ్డులో ప్రమాదాల నుంచి రక్షించాలని భక్తులు అమ్మవారిని పూజించడం ప్రారంభించారని, అప్పటి నుంచి సంప్రదాయం కొనసాగుతోందని పేర్కొంటున్నారు. ప్రతి ఆదివారం భక్తులు మైసమ్మకు మొక్కులు చెల్లిస్తున్నారు.
Comments
Loading comments...

