Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోచమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు

Follow Udayam on Google
Harika Aug 25, 2026 11:59 AM వనపర్తిGeneral
పోచమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు - Udayam
బోనాల పండుగ సందర్భంగా వనపర్తి పట్టణంలోని పోచమ్మ ఆలయానికి మంగళవారం భక్తులు పోటెత్తారు. మహిళలు బోనం కుండలతో తరలివచ్చి క్యూలైన్లలో అమ్మవారిని దర్శించుకుని నైవేద్యం సమర్పించారు. భక్తులు కోళ్లు, పొట్టేళ్లు బలిచ్చి, కొబ్బరికాయలు కొట్టి పిల్లాపాపలను చల్లగా చూడాలని అమ్మవారిని కోరుకున్నారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది.

Comments

G
Loading comments...