వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ ఓదెల మల్లికార్జున స్వామి ఆలయాన్ని దశలవారీగా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు తెలిపారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు.
రూ.1.30 కోట్లతో రోడ్లు, ఇతర పనులు చేపట్టామని తెలిపారు. రూ.15 కోట్లతో ఆలయ పునర్నిర్మాణం చేపట్టి, కొత్త గోపురాలు, రాతి శిల్పాలతో ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దనున్నట్లు ఆయన వెల్లడించారు.
Comments
Loading comments...

