వార్తలకు తిరిగి వెళ్లండి

బాలానగర్ వేంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం రాత్రి స్వామివారి జన్మనక్షత్రాన్ని పురస్కరించుకుని చిన్న రథోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శ్రీభూనీలా సమేత వేంకటేశ్వరస్వామివారిని రథంపై అధిష్ఠింపజేసి ఆలయం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణలు చేయించారు.
భక్తుల గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. ఆలయ ఛైర్మన్ శ్రీనివాసాచార్యులు, శ్రీధరాచార్యులు, భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
Comments
Loading comments...

