వార్తలకు తిరిగి వెళ్లండి

కలసపాడు పీహెచ్‌సీని సోమవారం సాయంత్రం డిప్యూటీ డీఎంహెచ్‌ఓ మల్లేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ అవార్డుల పరిశీలనలో భాగంగా ఆస్పత్రిలో క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టారు.
బయోమెడికల్ వ్యర్థాల వేరు చేయడం, పరిశుభ్రత, పరిసరాలు, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. కాన్పుల గది, ఓపీ, ఇన్‌పేషెంట్ గది, ల్యాబ్‌ను తనిఖీ చేశారు. వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొని తనిఖీ చేశారు.
Comments
Loading comments...

