వార్తలకు తిరిగి వెళ్లండి
డెప్యూటీ సీఎం భట్టి కాన్వాయ్ దారి తప్పడంపై ఎస్‌ఐపై వేటు

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కాన్వాయ్‌ను తప్పుదారిలో తీసుకెళ్లిన సూర్యాపేట జిల్లా కోదాడ రూరల్ ఎస్‌ఐ గోపాల్‌రెడ్డిని ఉన్నతాధికారులు వీఆర్‌కు అటాచ్ చేశారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
రూట్ మ్యాప్ మార్చి డొంక దారిలోకి కాన్వాయ్‌ను తీసుకెళ్లడంతో రహదారి లేక వాహనాలు 20 నిమిషాలు నిలిచిపోయాయి. డిప్యూటీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఎస్పీ ఈ చర్యలు తీసుకున్నారు.
Comments
Loading comments...