Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్

Follow Udayam on Google
Harika Sep 07, 2026 6:20 PM కర్నూలుGeneral
కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్ - Udayam
పత్తికొండ మండలాన్ని వెంటనే కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు రామచంద్రయ్య డిమాండ్ చేశారు. సోమవారం సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కరువుతో పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. ప్రతి రైతుకు ఎకరాకు రూ.50 వేల పరిహారం ఇవ్వడంతో పాటు పంట రుణాలు మాఫీ చేయాలని రామచంద్రయ్య కోరారు. ఉచిత విత్తనాలు, ఎరువులు, పశుగ్రాసం అందించాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...