Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాగాయపల్లిలో ఆర్టీసీ బస్సు పునరుద్ధరణకు డిమాండ్‌

Follow Udayam on Google
Sai Nath Sep 28, 2026 10:42 AM కడపGeneral
 నాగాయపల్లిలో ఆర్టీసీ బస్సు పునరుద్ధరణకు డిమాండ్‌ - Udayam
కడప–పెండ్లిమర్రి మార్గంలో నడిచే ఆర్టీసీ బస్సు నాగాయపల్లిలోకి రావడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బైపాస్‌ వద్దే బస్సు నిలిపివేయడంతో విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు, వ్యాపారులు అర కిలోమీటరు నడవాల్సి వస్తోందన్నారు. విద్యార్థులు, మార్కెట్లు, బ్యాంకులకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి బస్సును గ్రామంలోకి పునరుద్ధరించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...