వార్తలకు తిరిగి వెళ్లండి

పెబ్బేరు సంత, తైబజార్, పశువుల సంతలో రుసుముల పేరుతో జరుగుతున్న వసూళ్లపై విచారణ జరిపి లెక్కలు తేల్చాలని పాలమూరు ప్రజా సమాచార సమితి అధ్యక్షుడు రాఘవేంద్ర గౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం ప్రజావాణిలో ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు.
గత నెల 22వ తేదీ నాటి రశీదు నంబర్లు 30341, 14843 తమ వద్ద ఉన్నాయని తెలిపారు. వీటికి అధికారిక అనుమతి, టెండర్, బ్యాంక్ జమ వివరాలు వెల్లడించాలని కోరారు.
Comments
Loading comments...

