వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ ఈపీఎఫ్‌వో పింఛన్లు ఆలస్యమయ్యాయి. కొత్త సాఫ్ట్‌వేర్ ఉన్నతీకరణ కారణంగా తెలంగాణలో 4.63 లక్షలు, ఏపీలో 3.29 లక్షల మంది పింఛనుదారులకు జులై నెల చెల్లింపులు నిలిచిపోయాయి.
సెంట్రలైజ్డ్ డేటాబేస్ విధానంలో మార్పులతో ఈ సమస్య ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. శనివారం లేదా సోమవారం పింఛన్లు మంజూరయ్యే అవకాశం ఉందని ఈపీఎఫ్‌వో వర్గాలు వెల్లడించాయి.
Comments
Loading comments...
