Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేవాలయాల్లో వరుస దొంగతనాలను ఛేదించిన పోలీసులు

Follow Udayam on Google
K Anuradha Sep 13, 2026 1:10 PM శ్రీకాకుళంGeneral
దేవాలయాల్లో వరుస దొంగతనాలను ఛేదించిన పోలీసులు - Udayam
జిల్లాలో పలు దేవాలయాల్లో వరుస దొంగతనాలకు పాల్పడిన ముగ్గురు నిందితులను శ్రీకాకుళం రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.16 లక్షల విలువైన ఒక తులం బంగారం, 6 కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కోటబొమ్మాళి ప్రాంతాల్లోని దేవాలయాల్లో జరిగిన పలు దొంగతనాలు, బైక్ చోరీ కేసును ఛేదించినట్లు టౌన్ డీఎస్పీ వివేకానంద తెలిపారు. కేసు ఛేదించిన పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

Comments

G
Loading comments...