వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు జిల్లా హాలహర్వి మండలాన్ని కరవు మండలంగా ప్రకటించాలని కోరుతూ ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు హనుమంతు ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. వర్షాభావంతో కంది, పత్తి పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు.
మండలాన్ని కరవు మండలంగా ప్రకటించి ప్రతి రైతుకు రూ.25 వేల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ ఓంకారేశ్వర ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు.
Comments
Loading comments...

