వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ మౌలాలికి చెందిన రైల్వే రిటైర్డ్ ఉద్యోగి మారుతి సుతార్ (70)ను పింఛను డబ్బుల కోసం కన్న పిల్లలు, భార్య కలిసి దారుణంగా హత్య చేశారు. ఇంటర్నెట్‌లో చూసి ఉమ్మెత్త పూల పొడిని ఆహారంలో కలిపి ఇచ్చి, ఆపై కత్తులతో నరికి ముక్కలను బకెట్లలో దాచారు. 2019లో జరిగిన ఈ దారుణ ఘటనపై మల్కాజిగిరి న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది.
ఈ ఘాతుకానికి పాల్పడిన కుమారుడు, కుమార్తెకు ఉరిశిక్ష ఖరారు చేయగా, సహకరించిన భార్యకు జీవితఖైదు విధించింది.
Comments
Loading comments...

