వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లూరి జిల్లా డుంబ్రిగూడ మండలంలో గత రెండు రోజులుగా చలి తీవ్రత పెరిగింది. ఉదయం, రాత్రి వేళల్లో చలి ఎక్కువగా ఉండటంతో వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు.
పనుల కోసం బయటకు వెళ్లే గిరిజనులు చలి కారణంగా అవస్థలు ఎదుర్కొంటున్నారు. చలి నుంచి ఉపశమనం పొందేందుకు చలిమంటలు వేసుకుంటున్నారు. చలి తీవ్రత నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉంటున్నారు.
Comments
Loading comments...

